Wednesday, May 12, 2010

కరెంట్

అటు నువ్వే ఇటు నువ్వే....

పల్లవి : అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే,అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైనా ప్రతి మాటా నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా,నా చిరునవ్వే నీ వలనా
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేన,గురుతుకురానా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే...

అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే

చరణం : రంగూ రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ,తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ, నన్ను మాటాడిస్తుందీ
కనుపాప లోతులో దిగిపోయీ ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైనా మరుపే రావుగా
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనె లేను అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే,అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైనా ప్రతి మాటా నువ్వే

చరణం : నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏకాంతి లేదురా
మనసంత కూడ జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండ లేదురా
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటువెళుతున్నా ఏంచేస్తున్నా ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే,అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవుల పైనా ప్రతి మాటా నువ్వే

Tuesday, April 27, 2010

గులాబి

ఈవేళలో నీవు...
గానం : సునీత
సంగీతం : శశిప్రీతం
రచన : సిరివెన్నెల

పల్లవి : ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో
ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను

చరణం :నడిరేయిలో నీవు నిదురైన రానీఎవు
గడిచేదెలా కాలము...గడిచేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము...నీమీదనే ధ్యానము

ఏవైపు చూస్తున్న నీ రూపె తోచింది
నువు కాక వేరేది కనిపించనంటూందిఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏంతోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలువనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను...

My photos - WAYN.COM

My photos - WAYN.COM

Tuesday, March 9, 2010

పూజ




ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ

సంగీతం : రమెష్ నాయుడు
గానం : S.P.బాల సుబ్రమణ్యం ,వాణీ జయరాం

పల్లవి : ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ.. నీదీ
ఒక్క క్షణం నిను వీడీ నేనుండలేనూ
ఒక్క క్షణం నీ విరహం నే తళలేను

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ

చరణం :పున్నమి వెన్నెలలోనా.. పొంగును కడలి
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
నువ్వు కడలివైతే నెను నదిగ మరీ
చిందులే వేసి వేసి నిన్ను చేరనా..
చేరనా... చేరనా..

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ

చరణం : కోటి జన్మలకయినా.. కోరేదొకటే
నాలో సగమై ఎప్పుడు.. నెనుండాలి
నీవున్న వేళ.. ఆ స్వర్గమేల..
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ..
ఉందని.. ఉందని..

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ
ఎన్నటికీ మాయని మమతా నాదీ.. నీదీ
ఒక్క క్షణం నిను వీడీ నేనుండలేనూ
ఒక్క క్షణం నీ విరహం నే తళలేను

మెరుపు కలలు

వెన్నెలవే వెన్నెలవే ....

రచన : వేటూరి
సంగీతం :A.R.రెహమాన్
గానం : హరిహరన్, సాధనా సరగం

పల్లవి : వెన్నెలవే వెన్నెలవే ,
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...

వెన్నెలవే వెన్నెలవే ,
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …
వెన్నెలవే వెన్నెలవే ,
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...



చరణం : ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా ఆ ఆ.. పిల్లా ఆ ఆ..
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా.

వెన్నెలవే వెన్నెలవే ,
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …

చరణం : ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

పిల్లా ఆ ఆ.. పిల్లా ఆ ఆ..
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు .

ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ..
ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ..

వెన్నెలవే వెన్నెలవే ,
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …
వెన్నెలవే వెన్నెలవే ,
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...