Wednesday, July 29, 2009

ఓ పాపా లాలి

మాటేరాని చిన్నదాని ...

ఓ పాపా లాలి
సంగీతం: ఇళయరాజా
గానం: S.P.బాలసుబ్రఃమణ్యం


పల్లవి : మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా (2)

చరణం : : వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసలు నన్నే మరిపించే !

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా


చరణం : ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !


మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా (2)

ఎదుట నిలిచింది చూడు...

వాన


సంగీతం : కమలాకర్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : కార్తీక్


పల్లవి : ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ...ఆ ఆ ....


ఎదుట నిలిచింది చూడు

చరణం :నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ..ఆ ఆ ....


ఎదుట నిలిచింది చూడు


చరణం : నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ...ఆ ఆ .....

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ...ఆ ఆ ....

ఎదుట నిలిచింది చూడు

Seven Chakras of our body...


నీ తోనే ఉన్నాను .... నీ తోడుగా ఉన్నాను
కనులు మూసిన కనులు తెరచిన
కనిపించేది నీ రూపమే ...